NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 9:59 pm Posted by : NAMASTHE BHARAT

అశోక్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

అశోక్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

ఖానాపురం నవంబర్ 9 (మల్లేష్ నమస్తే భారత్ ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు’ కార్యక్రమంలో బాగంగా
నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి ఆదేశాల మేరకు ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జాడి అచ్యుత్ ఆధ్వర్యంలో గ్రామంలోని నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొనగా, లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కదురు సారయ్య, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గట్టి సారంగపాణి, వార్డు సభ్యులు చాగంటి నరేష్, జాడి వెంకటేష్, గట్టి రవి, రేఖ గణేష్, బైరి స్వామి, కొండి కొమ్మాల్, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కొండి వెంకటమ్మ, మక్క దేవి, మద్ది నర్సయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది ఎండీ రషీద్ ,కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.