NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:25 pm Posted by : NAMASTHE BHARAT

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖానాపురం జూలై 1 (నమస్తే భారత్ ) :
ఖానాపురం మండలంమనబోతులతండాలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా. సత్య శారద బుధవారం పరిశీలించారు.ఈసందర్భంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న బీఎల్‌ఓలతో మాట్లాడి సర్వే పురోగతిపై ఆరా తీశారు.
ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు.సర్వేపూర్తయిన తర్వాత సేకరించిన ఫారాలను మాత్రమే యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు.నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను నిర్వహించాలని బీఎల్‌ఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా,సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ సందర్శనలో ఖానాపురం తహాశీల్దార్ నంగునూరి రమేష్ , గ్రామ సర్పంచ్ అబోతు శ్రీలతఅశోక్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు