భవిత కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఖానాపురం జూలై 1(నమస్తే భారత్ ) :
ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ మనబోతుల తండాలో నిర్మాణం లో ఉన్న భవిత సెంటర్లను జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు.భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు (దివ్యాంగులు) ఉన్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన సమగ్ర సేవా కేంద్రాలు వాటిని ప్రజలు వారి పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవన నిర్మాణ పనులను పురోగతి, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ఏదైనా మిగిలిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలోని వసతులను పరిశీలించి, ప్రజలకు ఉపయోగపడేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
భవిత కేంద్రాన్ని త్వరలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోగా అప్పగించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో డీఈఓ రంగయ్య నాయుడు, డీఎస్ ఓ శ్రీనివాస్ , తహాశీల్దారు రమేష్ , స్కూల్ హెడ్మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.