NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 6:37 pm Posted by : NAMASTHE BHARAT

సేవా కార్యక్రమాల్లో 320 బి జిల్లా ఆదర్శం

సేవా కార్యక్రమాల్లో 320 బి జిల్లా ఆదర్శం

లయన్స్ ఇంటర్నేషనల్ 320 బి జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం

-జిల్లా గవర్నర్‌గా శైలజా నాయర్ బాధ్యతల స్వీకారం

-ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా అవంతి రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా చల్లా శ్రీనివాస్ రెడ్డి

-కొంపల్లిలో ఘనంగా 11వ క్యాబినెట్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం

-నేత్రదానంపై ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరణ

-సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని పిలుపు

కొంపల్లి, జులై 27 ( నమస్తే భారత్): లయన్స్ ఇంటర్నేషనల్ 320 బి జిల్లా చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా ఇతర లయన్స్ క్లబ్‌లకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయని పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ (పీఐడీ) లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ 320 బి జిల్లా 11వ క్యాబినెట్ ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 320 బి జిల్లా నూతన గవర్నర్‌గా శైలజా నాయర్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా అవంతి రెడ్డి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా చల్లా శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఐడీ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ, జిల్లా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శైలజా నాయర్ సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఆమె నాయకత్వంలో జిల్లాలోని అన్ని లయన్స్ క్లబ్‌లు మరింత చురుకుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నేత్రదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. నేత్రదానం ద్వారా పలువురికి వెలుగునిచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్టాలేషన్ చైర్మన్ హలోక్ కుమార్ జా, మాజీ జిల్లా గవర్నర్లు సెల్వ సాయిరాం రాజు, రాజేంద్ర ప్రసాద్, ఎస్.ఎన్. రెడ్డి, దీపక్ భట్టాచార్య, విద్యాసాగర్ రావు, విజయ్ కుమార్ శెట్టి, మోహన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ హేమల్ కన్విద్‌తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు, సేవాభావం కలిగిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.