హైదరాబాద్‌లో మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ
కుత్బుల్లాపూర్, జులై 31 ( నమస్తే భరత్ );హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి బృందావనం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 1న మధ్యాహ్నం 2 గంటలకు మోతీనగర్‌లోని వాసవి బృందావనం వద్ద జరగనుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.