NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:20 pm Posted by : NAMASTHE BHARAT

మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ,,కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ,

మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ,,కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ,

నమస్తే భరత్,, 5/10/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు డా. వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వాకిటి మానస హనుమంతు గారు, స్థానిక తహసీల్దార్ ఈ. సతీష్ కుమార్ గారు ఎంపీడీఓ గారు పాల్గొని తమ చేతుల మీదుగా వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, ఏఎంసీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గుడిగెళ్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్లు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.