NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 10:22 pm Posted by : NAMASTHE BHARAT

మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ

మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ

-మహాదేవపురం డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమం

-ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్

-ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు పిలుపు

-పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు

కుత్బుల్లాపూర్, జూన్ 30 ( నమస్తే భరత్ ): గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్ (దేవేందర్ నగర్)లో అక్షర జ్యోతి మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజ్గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి ప్రోత్సాహక కార్యక్రమాలు తదితర సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర జ్యోతి మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎన్. పూలమ్మతో పాటు జ్యోతి, రామలక్ష్మి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు యం. సాగర్, దంపనబోయిన శ్రీనివాస్, శివప్ప, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డాన్ శీను, ఋషి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, సాగర్, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.