NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:36 pm Posted by : NAMASTHE BHARAT

స్వయం సహాయ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

స్వయం సహాయ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

-శ్రీరామ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించిన పంపిణీ కార్యక్రమం

-ముఖ్య అతిథిగా పాల్గొన్న మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్

-మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న శ్రీనివాస్ గౌడ్

-సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు పిలుపు

కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రోడా మేస్త్రి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయ మహిళా సంఘాల సభ్యులకు అందిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మేడ్చల్ డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత, ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, స్వయం సహాయ సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, సబ్సిడీపై ఆర్టీసీ బస్సుల కల్పన వంటి పథకాల ద్వారా వారి ఆర్థిక పురోగతికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు రమణి, నిర్మల, మంజుల, కౌసల్యతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు సీహెచ్ బుచ్చిరెడ్డి, మధుసూదన్, రఘురెడ్డి, వెంకటేష్, బాలకృష్ణ, బలరాం, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.