NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:46 pm Posted by : NAMASTHE BHARAT

గాంధీనగర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్ల పంపిణీ

గాంధీనగర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ఉచిత స్కూల్ కిట్ల పంపిణీ

-రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

-విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేత

-స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ సమన్వయంతో నిర్వహణ

-విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పిలుపు

కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): 281వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఉన్న కాబ్సన్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కిట్లను అందుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు చక్రవర్తి రెడ్డి మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి చదువుకు చేయూత అందించడం తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సభ్యులు అభిషేక్, ధనుంజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగేశ్వరి, ఉపాధ్యాయులు వేణుగోపాల్, విజయశాంతి, శ్రావిక, సుమ, బాబీ, శంకర్‌తో పాటు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.