కుత్బుల్లాపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
-రూ.3.50 లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందజేత
-అనారోగ్య బాధితులకు ప్రభుత్వ అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
-అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్‌ను వినియోగించుకోవాలి: కూన శ్రీనివాస్ గౌడ్
-కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉంది
-లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన డీసీసీ ఉపాధ్యక్షులు
కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్యంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.3.50 లక్షల విలువైన చెక్కులను డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ గురువారం షాపూర్ నగర్‌లోని తన నివాసంలో పంపిణీ చేశారు.
వెంకట్రావు, లావణ్య, మోహన్, శంకర్ నాయుడు, స్వరూప తదితరులు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, వారి దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం మొత్తం రూ.3.50 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఆర్థిక చేయూత అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాసరెడ్డి, సీహెచ్ బుచ్చిరెడ్డి, మోతే శ్రీనివాస్ యాదవ్, షాకీర్, రఘు గౌడ్, వెంకట్ రెడ్డి, శంకర్ గౌడ్, చోటు బాయ్, లక్ష్మణ్, కనకరాజు, రాకేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.