మరిపెడ మండల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా
నమస్తే భారత్:-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు హల్వాల వీరయ్య పాల్గొని మాట్లాడుతూ మండలంలో ఉపాధి పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని అంతర్గత రహదారులు సైడ్ డ్రైనేజ్ వ్యవస్థను మెరూపరచాలని ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ పహారి గోడలు మంచినీరు టాయిలెట్స్ కాళీ పోస్టులను భర్తీ చేయాలని మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల భవనం మార్కెట్ యార్డు పాలసీతలీకరణ కేంద్రం క్రీడ మైదానం అన్యకాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని వీరయ్య డిమాండ్ చేశారు అనంతరం వివిధ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తాసిల్దార్ సూపర్డెంట్ కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ మండల నాయకులు బాణాల రాజన్న చైనా బోయిన వెంకన్న, మామునూరు రేణుక, మాము నూరి హరీష్, తప్పట్లా విజయ్, గుండా శ్రీను, బొజ్జమంగమ్మ, నున్రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు