నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
నిరుపేద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాలు మేరకు కంటయపాలెం గ్రామానికి చెందిన గంగాదరి యాకయ్య,జన్నాపురెడ్డి మల్లారెడ్డి లు ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న మహబూబ్ రెడ్డి బుధవారం వారి కుటుంబాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు రూ.6 వేలు, 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల సహకారంతో నిరుపేద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. నిరుపేదలకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చెవిటి సధాకర్, యూత్ జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షులు మహేష్ యాదవ్, నాయకులు పంజాల అల్లూరు, నాల్లం కుమార్,శిరం శెట్టి వీరభద్రం,పల్లె సురేష్ గౌడ్, ఎనగందుల సురేష్, జోగి వెంకన్న, సంద్రీ రాజు,గంగ దారి వెంకటేష్, పస్తం అంజయ్య,యర్రం రాజు యాదవ్, వల్లపు రాఘవులు, మందపూరు శ్రీధర్, రాగి పరిపూర్ణాచారి, రాగి సత్యం, ఈదునూరి మధు,తదితరులు పాల్గొన్నారు.