ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదు; ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కులకు పునాది వేసే జీవన విధానం
ప్రజాస్వామ్యం అనేది కేవలం ఓటు వేసే హక్కు మాత్రమే కాదు; ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కులకు పునాది వేసే జీవన విధానం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. 2007లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం ద్వారా సెప్టెంబర్ 15ను అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా ప్రకటించింది. 2008 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు....