రాంజీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టo 2005, యధావిధిగా కొనసాగించాలని డిమాండ్
నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం , సీఐటీయూ మండల కమిటీల ఆధ్వర్యంలో విబిజి -రాంజీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టo 2005, యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన నిర్వహించి ఎంపీడీవో క్రాంతి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ రైతు సంఘం.మండల.అధ్యక్షులు,గోడిశాల వెంకన్న, నీరుటి జలంధర్ లు మాట్లాడుతూ కరువులు వలసల నివారణకు దశాబ్దాల పోరాటం ఫలితంగా 2005 యూపీఏ-1 ప్రభుత్వం వామపక్ష పార్టీల ఎంపీల మద్దతుతో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంఅమలు జరిగింది,20 సంవత్సరాలు అనేక ఆర్థిక సంక్షోభల నుండి భారత దేశ ప్రజలను బయటపడేసింది.
ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి వి వి జి రామ్ జి పేరుతో చట్టం చేసి 2026జూలై 1 నుంచి అమలు చేస్తున్నారు. పాత చట్టం 90 శాతంకేంద్రo, 10 శాతం రాష్ట్రo నిధులు కేటాయించి ఖర్చు చేశారు.ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం ప్రకారం 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రం నిధులు కేటాయించి అమలు చేయాలని మేలికబెట్టడం రాష్ట్రాల ఆదాయాలు లేకుండా చేసి ఉపాది చట్టాన్ని నీరుగార్చడం కోసం.కేంద్రప్రభుత్వంఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తుందన్నారు.
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించి వివిజి రాంజీ రద్దు చేయాలని, ప్రతి సంవత్సరం, 200 రోజులు పని కల్పించి రోజుకు 600 వేతనం ఇవ్వాలని, ముఖ ఆధారిత రెండు పూటలా హాజరు తీసుకుని పద్ధతి రద్దు చేయాలని, పని ప్రదేశంలో టెంటు మెడికల్ కిట్టు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, పనిముట్లు కూలీలకు ఇవ్వాలని పనిచేసిన 15 రోజుల్లోపు డబ్బులు చెల్లించాలని డిమాండ్లను పరిష్కరించడం కోసం మీద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు మా సంఘాలుగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు జాన్పాటిజ్యోతి,వ్యవసాయకార్మిక,సిఐటియు, రైతు సంఘాల, నాయకులు మాదా శ్రీనివాస్, తులసి మొగ్గ వెంకన్న, బుద్ధారపు నాగరాజు , పొన్నాల జ్యోతి, మేకల నాగమణి, మాయ అనూష, ఏదుల కల్పన, మేకల భద్రమ్మ, పెద్ద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.