సెప్టెంబరు 3,4 తేదీలలో
సిపిఐ(ఎం) రాజకీయ
శిక్షణ తరగతులు..
-అబ్బాయిపాలెంలో
కరపత్రం ఆవిష్కరణ
-మండల కార్యదర్శి
గుండ గాని మధుసూదన్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ.మండలం అబ్బాయిపాలెం గ్రామంలో సెప్టెంబరు3,4 తేదీలలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ తెలిపారు. శనివారం అబ్బాయిపాలెం గ్రామంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలల్లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయాసం పథకం అమలు కాలేదని మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ దానిని నేటి వరకు.అమలు.చేయలేదన్నారు. అట్లాగే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను రద్దు చేయాలని ఆలోచనలు ప్రభుత్వ ఉందన్నారు. తులం బంగారం ఇస్తామన్నారు అది ఇవ్వలేదు. వంటగ్యాసు ధరలు 500 నుండి 1050కి పెంచడంతో పేదలు మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందన్నారు నిరుద్యోగ భృతి కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని ఆరోపించారు. అంశాల నీటిపై సిపిఐ (ఎం) నిరంతరంగా దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న కాలంలో ప్రజా పోరాటాలని ఉదృతం చేయడానికి రాజకీయ శిక్షణలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని సుమారు 120 మంది సభ్యులకు రెండు రోజులపాటు అబ్బాయి పాలెం లో ఆతిథ్యం కల్పించి వారిని చైతన్యం చేయడానికి రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి అన్నారు.ప్రజలు అధికారులు ప్రజాతంత్ర వాదులు మేధావులు ఆదరించి హార్దిక సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజన్న, సిపిఐ ఎం వార్డు సభ్యురాలు నందిపాటి ఉప్పలమ్మ, వెంకన్న, మండల నాయకులు జిన్నా లచ్చయ్య, శాఖ కార్యదర్శి కొండ ఉప్పలయ్య, నాయకులు జినక సైదులు, ఎర్ర వెంకన్న, జామ్మూర్తి, కామిడ్ల వెంకన్న, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు