కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి
బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్
నర్సంపేట ఆగష్టు11 (నమస్తే భారత్ ) :
నర్సంపేట కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ ,బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు ,మహోన్నత నేత నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహా నిర్మాణంలో గద్దెను కూల్చడం పట్ల బిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందన్నారు. పెద్ధి ఒక మహోన్నత నేత, ఉద్యమకారుడు. తన జీవిత కాలమంతా తెలంగాణ ప్రాంతానికి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికే ధారపోసిన గొప్ప వ్యక్తి. ఆయన స్వర్గస్తులైన సందర్భంలో, వారి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఆయన కొడుకులు లేదా మనుమళ్లు కాదు. నర్సంపేట పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని చోట, ఆయనపై ఉన్న అభిమానంతో ఒక దళిత కుటుంబం కేటాయించిన సొంత పొలంలో అభిమానులు, సామాన్య ప్రజలు కలిసి ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు.
దీనిని కూడా ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంలో పనికిమాలిన లీడర్లుగా చెలామణి అవుతున్న గుండాలు, రౌడీలు బిఆర్ఎస్ నిబద్ధత కలిగిన కార్యకర్తలకు సూచనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి గానీ, బిఆర్ఎస్ పార్టీ గురించి గానీ మాట్లాడే అర్హత నర్సంపేట కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు.
నర్సంపేట నియోజకవర్గానికి ఎటువంటి ఉపయోగం లేని, ఎలాంటి అభివృద్ధి చేయని, అధికార బలం చూపిస్తూ రౌడీయిజం చేసే వ్యక్తుల విగ్రహాలను బస్టాండ్ సర్కిల్ వంటి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసుకుని, తమ తాతల, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ తిరిగే వెధవలు బిఆర్ఎస్ పార్టీని, పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు.రాజశేఖర్ రెడ్డి విగ్రహం గురించి, ఇతర విగ్రహాల గురించి మాట్లాడే కాంగ్రెస్ వెధవలు… పెండేం కట్టయ్య గారి విగ్రహం బస్టాండ్ చౌరస్తాలో ఎందుకు ఉందో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. వారి వారసులమని చెప్పుకునే సన్నాసులు ఆ విగ్రహాన్ని తమ సొంత స్థలంలో ఏర్పాటు చేసుకుని గార్డెన్ ఎందుకు పెంచుకోలేదో, బస్టాండ్ కూడలిలోనే ఎందుకు పెట్టారో బహిరంగంగా చెప్పాలి.
దీనికి సమాధానం చెప్పలేని పక్షంలో, ఆ విగ్రహాన్ని వెంటనే తొలగించలన్నారు.బిఆర్ఎస్ కార్యకర్తల పాదాలు పట్టుకుని కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలి.సిగ్గుమాలిన, బుద్ధిమాలిన హెచ్చరికలు, హితవులు కట్టిపెట్టి కాంగ్రెస్ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలను నెలకొల్పి, ఆయన ఆశయ సాధనకు బిఆర్ఎస్ శ్రేణులు నిరంతరం కృషి చేస్తారన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే బిఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.



