హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: బీఆర్‌ఎస్ నిరసన
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: బీఆర్‌ఎస్ నిరసన మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం :(నమస్తే భరత్) కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పాపన్నపేటలో నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పాపన్నపేట చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హామీలను అమలు చేయాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ...