NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 10:29 pm Posted by : NAMASTHE BHARAT

కొమ్ము సునీల్ తల్లి మృతికి సంతాపం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి.

కొమ్ము సునీల్ తల్లి మృతికి సంతాపం.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమ్మి గౌడ్ చిలువేరు

కేసముద్రం:

కేసముద్రం మార్కెట్‌లో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న కొమ్ము సునీల్ తల్లి కొమ్ము నీలమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమని ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ పేర్కొన్నారు. నీలమ్మ మృతి విషయం తెలుసుకున్న వారు ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం నీలమ్మ భర్త శంకరయ్యను పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నీలమ్మ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో.ఆర్ టి ఎ సభ్యులు రావుల మురళి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దుర్గేష్,వార్డ్ కౌన్సిలిర్ వల్లందాసు రవి,వేముల శ్రీనివాస్ రెడ్డి,బధ్యానాయక్, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, వసంత రావు,తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.