పార్టీకి తీరని లోటుగా కామ్రేడ్ సంతోష్ మృతి
➤ గుబురు గుట్ట శాఖ సహాయ కార్యదర్శికి సిపిఐ నాయకుల ఘన నివాళి
➤ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన యువ నాయకుడిని కోల్పోయామని ఆవేదన
➤ కుటుంబానికి అండగా ఉంటామని సిపిఐ నాయకుల భరోసా
జగద్గిరిగుట్ట ఆగస్టు 4 ( నమస్తే భరత్ ); గుబురు గుట్ట సిపిఐ శాఖ సహాయ కార్యదర్శి, యువజన నాయకుడు కామ్రేడ్ సంతోష్ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విషాదకరమని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ నిర్వహించిన అనేక ప్రజా ఉద్యమాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కామ్రేడ్ సంతోష్ విశేష కృషి చేశారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, విధేయ కార్యకర్తగా ప్రజల మధ్య సేవలందించిన యువ నాయకుడి అకాల మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని సిపిఐ నాయకులు హామీ ఇచ్చారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ మరింత బలోపేతం దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్, జిల్లా కార్యదర్శి ఉమామహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యేసు రత్నం, మండల కార్యదర్శి స్వామి, సహాయ కార్యదర్శులు రాములు, హరినాథ్ రావు, ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడు ప్రవీణ్, అధ్యక్షుడు బాబు, శాఖ కార్యదర్శులు కొండయ్య, వెంకటేష్, సిపిఐ నాయకులు ఇమామ్, యాదగిరి, వెంకటేష్, అరవింద్, శ్రీకాంత్, జంబు తదితరులు పాల్గొని కామ్రేడ్ సంతోష్‌కు ఘనంగా నివాళులర్పించారు.