NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:49 pm Posted by : NAMASTHE BHARAT

ప్రజా సమస్యల పరిష్కారానికే   సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక

ప్రజా సమస్యల పరిష్కారానికే
సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక

సర్పంచ్ దాసరి రమేష్

ఖానాపురం జూలై10 (నమస్తే భారత్ ) :

ప్రజా సమస్య ప్రాధాన్యతను బట్టి వరుస క్రమంలో ప్రభుత్వ నిధులతోపరిష్కారించబడుతుందని ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ అన్నారు.
2026-27 సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ దాసరి రమేష్ అధ్యక్షతన సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ “గ్రామ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి. మీ వీధిలో ఏ సమస్య ఉంది, ఏ పని ముందు కావాలి అనేది మీరే నిర్ణయించాలి. అందుకే ఈ
సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ పెట్టాం” అని తెలిపారు.
గ్రామసభలో రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, తాగునీరు, అంగన్ వాడీ భవనం మరమ్మత్తులు, నూతన అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, నూతన హెల్త్ సబ్ సెంటర్, కొత్త పైపు లైన్ నిర్మాణాల పై గ్రామస్తులు విస్తృతంగా చర్చించారు.
“ఈ రోజు సభలో వచ్చిన ప్రతి డిమాండ్‌ను ప్రాధాన్యత క్రమంలో రాసి సమగ్ర గ్రామ అభివృద్ధి ప్రణాళికలో చేరుస్తాం. నిధులు వచ్చిన వెంటనే పనులు మొదలుపెడతాం. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని వార్డులకు సమానంగా అభివృద్ధి పనులు చేపడతాం” అని సర్పంచ్ దాసరి రమేష్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు పల్నాటి నిర్మల, భూక్య స్రవంతి, అజహర్, శాఖమూరి ముఖేష్, గుండ్లపల్లి మంజుల, ఈలపొంగు కొమరమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.