ప్రజా సమస్యలపై కమిషనర్ సృజన ఐఏఎస్ క్షేత్రస్థాయి తనిఖీ

కొంపల్లిలో ‘ప్రతిరోజు ఒక వార్డ్’ కార్యక్రమంలో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం
-ఎన్‌సీఎల్ కాలనీ, నోబుల్ ఎన్‌క్లేవ్‌లో పర్యటించిన కమిషనర్
-డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై సమీక్ష
-స్థానికుల ఫిర్యాదులు స్వీకరించి తక్షణ చర్యలకు అధికారులకు ఆదేశాలు
-ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేసిన జెమ్మి దేవేందర్
-సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన
-ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు, కాలనీ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు
కొంపల్లి, జులై 20 ( నమస్తే భరత్ ఆంధ్ర);
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన “ప్రతిరోజు ఒక వార్డ్” కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన ఐఏఎస్ సోమవారం కొంపల్లి డివిజన్ పరిధిలోని ఎన్‌సీఎల్ కాలనీ మరియు నోబుల్ ఎన్‌క్లేవ్ ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడిన కమిషనర్ పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్‌సీఎల్ కాలనీ వాసులు ప్రధానంగా డ్రైనేజీ సమస్యతో పాటు కాలనీలో నెలకొన్న ఇతర మౌలిక వసతుల లోపాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ఓర్పుగా విన్న కమిషనర్, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొంపల్లి మాజీ సర్పంచ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జెమ్మి దేవేందర్ కొంపల్లి డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలను వివరిస్తూ కమిషనర్ సృజన ఐఏఎస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను దశలవారీగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బైరీ ప్రశాంత్ గౌడ్, కొంపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిరెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ లేబర్ సెల్ అధ్యక్షుడు కందాడి సుదర్శన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ లేబర్ సెల్ అధ్యక్షుడు కావలి గోపాల్ ముదిరాజ్, అంజి ముదిరాజ్, షేక్ ఇబ్రహీం, ఖదీర్, కావలి నవీన్ ముదిరాజ్, ఎన్‌సీఎల్, నోబుల్ ఎన్‌క్లేవ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు సారికా రెడ్డి, శశిధర్, నాగరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.