ముర్రుపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం
ముర్రుపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరం : సీడీపీఓ మధురిమ ఖానాపురం ఆగష్టు7 (నమస్తే భారత్ ) : బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని, మొదట వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని ఐసీడీఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ సీడీపీఓ మధురిమ , ఖానాపురం ఎంపీడీఓ అధ్వైత అన్నారు. ఖానాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దాసరి రమేష్ అద్యక్షతన గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఏడుగురుగర్భిణిలకు సీమంతం,ముగ్గురు చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం సీడీపీఓ మధురిమ...