NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 9:41 pm Posted by : NAMASTHE BHARAT

నీట్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్ మను చౌదరి ఆకస్మిక తనిఖీ

నీట్ పరీక్ష నిర్వహణపై కలెక్టర్ మను చౌదరి ఆకస్మిక తనిఖీ

జేఎన్టీయూ పరీక్షా కేంద్రంలో ఏర్పాట్ల పరిశీలన

సీసీ కెమెరాల ద్వారా పరీక్ష నిర్వహణ పర్యవేక్షణ

అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

అధికారులతో సమీక్షించి వివరాల సేకరణ

హైదరాబాద్, జూన్ 21 ( నమస్తే భరత్ ):మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్‌పల్లి మండల పరిధిలో ఉన్న జేఎన్టీయూ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ (NEET) ప్రవేశ పరీక్షను జిల్లా కలెక్టర్ మను చౌదరి ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్ష నిర్వహణ సజావుగా జరుగుతోందో లేదో తెలుసుకునేందుకు ఆయన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను తనిఖీ చేశారు. కళాశాలలోని వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా అభ్యర్థుల పరీక్షా ప్రక్రియను పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరీక్ష నిర్వహణలో పాటిస్తున్న నిబంధనలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా, అభ్యర్థులకు ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఆర్డీవో శ్యాంప్రకాష్, కూకట్‌పల్లి తహసీల్దార్ అశోక్ కుమార్, బాలానగర్ తహసీల్దార్ శ్రీనివాస్, మేడ్చల్ తహసీల్దార్ భూపాల్, సూపరింటెండెంట్లు తదితర అధికారులు పాల్గొన్నారు.