NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:38 pm Posted by : NAMASTHE BHARAT

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా.. ఇద్దరికి రూ.6.50 లక్షల ఎల్ఓసీలు

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా.. ఇద్దరికి రూ.6.50 లక్షల ఎల్ఓసీలు

-ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చొరవతో మంజూరు

-చింతల్‌లో లబ్ధిదారులకు పత్రాల అందజేత

-వైద్య చికిత్సకు ఆర్థిక చేయూత
పార్టీ నాయకుల పాల్గొనిక

కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఊరటనిచ్చేలా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్ కేపీ వివేకానంద్ చొరవతో ఇద్దరు లబ్ధిదారులకు రూ.6.50 లక్షల విలువైన ఎల్ఓసీలు మంజూరయ్యాయి. బుధవారం చింతల్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు లబ్ధిదారులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. మంజూరైన ఎల్ఓసీల్లో 127వ రంగారెడ్డి నగర్ డివిజన్ పంచశీల కాలనీకి చెందిన మధుస్మిత జెనా (తండ్రి సురేందర్ కుమార్ జెనా)కు రూ.1.50 లక్షలు, 131వ కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఎస్.వి. విజయలక్ష్మి (భర్త ఫ్రాన్సిస్)కు రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యవసర వైద్య అవసరాల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయం అనేక కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోందన్నారు.
కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, ఎండి. నజీరుద్దీన్, ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, ఎర్వ సాయికిరణ్ (బంటీ), రమణారెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్, నాగేష్, దిలీప్, మధుకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమణమూర్తి, సీతారామయ్య, రామకృష్ణ, లక్ష్మణ్ గౌడ్, అల్లావుద్దీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.