NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 November 2026, 10:06 pm Posted by : NAMASTHE BHARAT

*విద్యార్థుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..*

*విద్యార్థుల మధ్య సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు..*

*కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజక వర్గ చైర్మెన్ జాంగారి రవి ఆధ్వర్యంలో*

*150 మందికి విద్యా సామగ్రి, దుప్పట్ల పంపిణీ*

*షాద్‌నగర్ ఎస్సీ వసతి గృహంలో సేవా కార్యక్రమాలతో ఘనంగా జన్మదిన సంబరాలు*

నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్09: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత వసతి గృహంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జాంగారి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 150 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయగా, కాంగ్రెస్ యువ నాయకుడు కేకే కృష్ణ దుప్పట్లు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ చల్ల శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు చెంది తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ్రాతి బాలరాజు గౌడ్, యువ నాయకుడు కేకే కృష్ణ, బాధేపల్లి సిద్ధార్థ, వెలిజర్ల గ్రామ సర్పంచ్ ఆర్. బాబు నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినాన్ని విద్యార్థుల మధ్య సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల చదువుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
జాంగారి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా పాలన కొనసాగుతోందన్నారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. సింగిల్ విండో చైర్మన్ చల్ల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని, రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధేపల్లి సిద్ధార్థ, చౌలపల్లి సర్పంచ్ వడ్ల జంగయ్య, ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు, కౌన్సిలర్ శిరీష, సింగాపగ అనిల్ కుమార్, జక్కని రవికుమార్, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గడ్డం జంగయ్య, మండల అధ్యక్షుడు బూర్గుల శివకుమార్, పెంటనోళ్ల ఆంజనేయులు, గునుగుర్తి రాజశేఖర్, కాంగ్రెస్ మహిళా విభాగం తాలూకా అధ్యక్షురాలు పిట్ట రజిత, భూమగల్ల శ్రీనివాస్, చెన్నగల్ల రామకృష్ణ, గుట్ట రాజు, జాంగారి జంగయ్య, జిల్లెల జంగయ్య, నాని, సాజిద్, తుప్పరి శేఖర్, చిలకమర్రి యోగి, మొగిలిగిద్ద అనిల్ కుమార్, చిన్నంతగారి కృష్ణ, గట్టుపల్లి రాజు, బోడ యాదగిరి, జక్కని భీమ్ రాజ్, కడిగల్ల రాజు, కావాలి నర్సింహులు, తుప్పరి రమేష్, మహేష్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.