NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 7:42 pm Posted by : NAMASTHE BHARAT

ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: పుప్పాల భాస్కర్

ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: పుప్పాల భాస్కర్

24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్.. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపడతామని హెచ్చరిక

 

కుత్బుల్లాపూర్, జులై 31 ( నమస్తే భరత్ ); ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి చేసినట్లు ప్రచారంలో ఉన్న “క్రిమినల్ వేస్ట్” వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సూరారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ పేర్కొన్నారు. 24 గంటల్లోపు ఇంజినీరింగ్ విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏకమై తమ నిరసనను వ్యక్తం చేస్తారని హెచ్చరించారు.ఇంజినీరింగ్ విద్యార్థులను అవమానించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, “మేము క్రిమినల్స్ కాదు.. దేశ భవిష్యత్తును నిర్మించే ఇంజినీర్లం” అని ఆయన అన్నారు. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని భాస్కర్ డిమాండ్ చేశారు.