NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 10:33 pm Posted by : NAMASTHE BHARAT

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం

నమస్తే భారత్ , రాజేంద్రనగర్, నవంబర్ 12, ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రోడ్డు ప్రమాదంలో త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారి పై ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం కోట మధుసూదన్, అతని కుమారుడు శ్రీకర్ బాబు, శేఖర్ మాస్టర్లు కలిసి గొల్లూరు గ్రామ పరిధిలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఉదయం ఐదు గంటల సమయంలో ఇన్నోవా కార్ టిఎస్9 ఎఫ్ జి 33 48 నెంబర్ గల కార్ నడుపుతూ గొల్లూరు గ్రామం నుండి బయలుదేరి బంజర హిల్స్ హైదరాబాద్కు వెళుతుండగా ఆ సమయంలో గొల్లూరు ఎక్స్ రోడ్డు పి వన్ రోడ్డు వద్దకు చేరుకొని రిటర్న్ తీసుకుంటుండగా పాలమాకుల వైపు నుంచి సంఘీ కూడా వైపు వెళుతున్న మహేంద్ర బొలెరో ట్రక్ k8 ac 32 63 గల వాహన పదారుడు అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ కారువైపున ఢీకొట్టడం జరిగిందని కారు ఫల్టీ కొట్టడంతో ఇన్నోవా కార్ పూర్తిగా డ్యామేజ్ అయిందని, కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని, వాహనాన్ని అజాగ్రత్తగా అతివేగంగా నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిపై చటారీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.