NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:26 pm Posted by : NAMASTHE BHARAT

గంధసిరి శరణ్య పల పుష్పాలంకరణ (ఒడినింపుట) వేడుకకు హాజరైన చిలివేరు సమ్మయ్య గౌడ్

గంధసిరి శరణ్య పల పుష్పాలంకరణ (ఒడినింపుట) వేడుకకు హాజరైన చిలివేరు సమ్మయ్య గౌడ్

శరణ్యకు పట్టు వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించిన గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మిగౌడ్.

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామానికి చెందిన గంధసిరి యాదగిరి – సుభద్ర దంపతుల కుమార్తె కుమారి గంధగిరి.శరణ్య.పలపుష్పాలంకరణ (ఒడినింపుట) వేడుక ఆదివారం వారి స్వగృహంలో బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు సమ్మిగౌడ్ చిలువేరు ముఖ్య అతిథిగా హాజరై, శరణ్యకు అలాగే ఆమె కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు బహుకరించి “ఆడబిడ్డ ప్రతి కుటుంబానికి మహాలక్ష్మి స్వరూపిణి..విద్యతో పాటు మంచి సంస్కారం, విలువలతో ఎదిగి కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని, సరస్వతి, లక్ష్మీదేవి అనుగ్రహంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని” మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
అలాగే మన తెలుగు సంప్రదాయాలను.సంస్కృతిని ప్రతిబింబించే ఇటువంటి పరిపుష్పాలంకరణ, ఒడినింపుట వంటి ఆచారాలను భావితరాలకు అందించడం ప్రతి కుటుంబం బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని శరణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విచ్చేసిన అతిథులకు నిర్వాహకులు సాదర స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుక ఆహ్వానితులను ఆకట్టుకుని ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సమ్మిగౌడ్ తో పాటు మాజీ సర్పంచ్ వెంకన్న గౌడ్, యాదగిరి, రిపోర్టర్ చింతనూరి రాజు,మోడెం రాజు, పలుస సునీతా వెంకన్న, తండ సంపత్ గౌడ్, యండి షబ్బీర్, ఆకుల రాజు,బబ్బురి బుచ్చిరాములు, పలుస రాకేష్,రాజా నాయక్, వెంకటేశ్వర్లు,నాని మోడెం తదితరులు పాల్గొన్నారు