దూస్ కల్ లో ఘనంగా బాలల దినోత్సవం.

*దూస్ కల్ లో ఘనంగా బాలల దినోత్సవం.* నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని దూస్ కల్ పాఠశాలలో బాలల దినోత్సవంను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టికార్యక్రమంలో చిన్నారులు బాలదినోత్సవం, భారత తొలి ప్రధాని చాచా నెహ్రూకు సంబంధించి ఉపన్యాసాలు, పాటలు, నృత్యాలలో పాల్గొని అలరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రబిందువైన చిన్నారులకు స్వీట్లు, బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. గ్రామసర్పంచ్ శ్రీమతి జ్యోతిర్మయి అంజి గారు ప్రత్యేకంగా కేక్ తీసుకునివచ్చి కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేయడం అభినందనీయం....