*దూస్ కల్ లో ఘనంగా బాలల దినోత్సవం.*

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్14:రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని దూస్ కల్ పాఠశాలలో బాలల దినోత్సవంను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టికార్యక్రమంలో చిన్నారులు బాలదినోత్సవం, భారత తొలి ప్రధాని చాచా నెహ్రూకు సంబంధించి ఉపన్యాసాలు, పాటలు, నృత్యాలలో పాల్గొని అలరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రబిందువైన చిన్నారులకు స్వీట్లు, బహుమతుల ప్రదానం చేయడం జరిగింది. గ్రామసర్పంచ్ శ్రీమతి జ్యోతిర్మయి అంజి గారు ప్రత్యేకంగా కేక్ తీసుకునివచ్చి కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేయడం అభినందనీయం.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఐనాల కుమార్, ఏ ఎమ్ సి డైరెక్టర్ యాదయ్య, గ్రామ కార్యదర్శి ఆశీష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి,రేవతి, ఉపాధ్యాయులు సతీష్, శైలజ, వెంకటేష్, శివరాములు,శిరీష, శ్రీనివాస్, సర్ఫరాజ్ అన్వర్ మరియు తల్లిదండ్రులు, చిన్నారులు పాల్గొని విజయవంతం చేశారు.