NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 10:56 pm Posted by : NAMASTHE BHARAT

సముద్ర తీర ప్రాంతాల్లో రేషన్‌ సరుకుల పంపిణీలో గందరగోళం!

సముద్ర తీర ప్రాంతాల్లో రేషన్‌ సరుకుల పంపిణీలో గందరగోళం!

కొందరికే నిత్యావసర సరుకులు.. మరికొందరికి అందని వైనం

ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని సముద్ర తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల విషయంలో అసమానతలు చోటుచేసుకున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి సరుకులు అందగా, మరికొందరికి అందకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే రేషన్‌ సరుకులు చేరాల్సి ఉండగా, కొందరికి మాత్రమే పంపిణీ చేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు సరుకులు ఎందుకు అందలేదో సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. పంపిణీలో నెలకొన్న సమస్యలను పరిశీలించి, అర్హులైన వారందరికీ నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సముద్ర తీర ప్రాంత ప్రజలు అధికారులను కోరుతున్నారు.