హామీలను అమలు పరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
నమస్తే భారత్ :-మరిపెడ
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి విమర్శించారు
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరిగిన సిపిఐ పట్టణ సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఏటా కోటి ఉద్యోగాలు, వంద రోజులలో నిత్యవసర వస్తువుల ధరలు తగ్గింపు, నల్లధనం వెలికితీత, పేదరిక తగ్గింపు, లాంటి మాటలు కోటలు దాటాయి తప్ప ఆచరణలో ప్రజలకు మొండి చేయి చూపిన మోదీ ప్రభుత్వం.లక్షలాది పిల్లల భవితవ్యం.నిర్దేశించే నీట్ లాంటి పరీక్ష పేపర్లు లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో వారిపై లాఠీ చార్జ్ చేయడం అమానుషమైన చర్య అని అన్నారు.ఇప్పటికైనా కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు, చేయూత పెన్షన్లు యువతకు ఉద్యోగాల కల్పన.రైతాంగానికి.సాగునీరు.అందించడంలో విఫలం కావడమే కాకుండా, వైద్య,విద్యారంగంపై స్పష్టమైన విధానాలు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలకు నిదర్శమని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు ఇచ్చిన స్పష్టమైన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎండ కట్టడానికి ఆగస్టు 6 నుంచి 14 వరకు మండల కేంద్రాలలో.పాదయాత్రలు.నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ అబ్దుల్ రషీద్ వాంకుడోత్ అమృనాయక్, వనపర్తి నందు తదితరులు పాల్గొన్నారు