NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 10:22 pm Posted by : NAMASTHE BHARAT

దూలపల్లిలో ఉచిత వైద్య సేవల సందడి

దూలపల్లిలో ఉచిత వైద్య సేవల సందడి

47వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన కిషోర్ రెడ్డి

ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కాలనీ వాసులకు పిలుపు

ప్రజారోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని వ్యాఖ్య

పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు

కుత్బుల్లాపూర్, జూన్ 21: నమస్తే భరత్;
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దూలపల్లి సొసైటీ బ్యాంక్ వికార్ సెక్షన్ కాలనీలో నిర్వహించిన 47వ ఉచిత వైద్య శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ అండ్ కోఆర్డినేషన్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించిన ఆయన, ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇటువంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. దూలపల్లి సొసైటీ బ్యాంక్ వికార్ సెక్షన్ కాలనీ వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రాజు, మాజీ ఎంపీటీసీ మల్లేష్, మాజీ కౌన్సిలర్ శివకుమార్ గౌడ్, భాస్కర్ గౌడ్, బోగారం వెంకటేష్, ఐలేష్ యాదవ్, డప్పు నరేందర్, సాధు యాదవ్, శివారెడ్డి, కాలనీ వాసులు, టీమ్ బీకేఆర్ సభ్యులు పాల్గొన్నారు.