ప్రజా చైతన్య యాత్ర గోడ పత్రిక విడుదల చేసిన బుద్ధుల జంగయ్య
నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 16:జిల్లేడు చౌదరిగుడా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన గోడపత్రికను జిల్లెల్ల వెంకటేష్ సిపిఐ మండల కార్యదర్శి ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఏ ఒక్కరి కన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు బిఎస్ఎన్ఎల్ రైల్వే ఓడరేవులు అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని అంబానీలకు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శమని దుయ్యబట్టారు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా రాముని పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అయోధ్యలో రామ మందిర విరాళాలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని స్వామీజీలు ఆరోపిస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితులో కేంద్ర ప్రభుత్వం ఉందంటే దానికి అర్థమేంటి కేంద్ర బిజెపి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అవగాహతమైతుందని ఆయన ఆరోపించారు
నీట్ పేపర్ లీకేజీ విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశంలోని యువత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన పరిస్థితి బీజేపీ పతనానికి నాంది అని అన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర వస్తువులను విపరీతంగా పెంచేసి పేదవారు ఏమి కొన్న దానిపై జిఎస్టి వేసి ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి మాత్రం అంటి ముట్టనకు వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు అన్నిటిని కూడా తగ్గించాలని పేదల ఆహార ధాన్యాలపై జిఎస్టి విధించొద్దని ఆయన డిమాండ్ చేశారు ఈనెల 17 నుంచి 21 వరకు రంగారెడ్డి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర ప్రజలను చైతన్యం చేస్తూ నిర్వహిస్తున్నామని ఈ ప్రజా చైతన్య యాత్ర 19వ తేదీన జిల్లేడ్ చౌదరిగుడా కొందుర్గు మండలంలో పర్యటిస్తుందని ఈ చైతన్య యాత్రకు కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం డి షబ్బీర్ మండల నాయకులు చోటు బై అన్వర్ పాపయ్య రామయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.