NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:46 pm Posted by : NAMASTHE BHARAT

మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

నర్సంపేట జులై28(నమస్తే భారత్ ) :
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం, శివాంజనేయ స్వామి దేవాలయంలో బీఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు,మాజీ ఎంపీపీ, కౌన్సిలర్ లు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ తక్కలపెల్లి రవీందర్ రావు మాట్లాడుతూ వందలాది మంది కార్యకర్తలు అభిమానులు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యం బాగుపడాలని, దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుతున్నాము
వేలాది లక్షల మంది ఉద్యమ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసిఆర్ కి కుడి భుజంగా ఉండి ముందు వరుసలో నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆకస్మికంగా ఆరోగ్యం క్షీణించి అపోస్మాదకస్థితికి వెళ్లిపోవడం బాధాకరం.
భగవంతుడు ఉన్నాడు కాబట్టే రోహిణి హాస్పిటల్ లో వైద్యశాస్త్రమె ఆశ్చర్యపడే రీతిలో ఇది సుదర్శన్ రెడ్డి కొన ఊపిరితో ప్రాణం పోసుకుని ముందుకు సాగడం జరిగింది.ఆ క్రమంలో పార్టీ యంత్రాంగం ఆది నాయకత్వం అందరూ కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించి మొన్నటి నుండి ఈ రోజు వరకు వెంటిలేటర్ పైన మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది.
ఉన్నతమైన వైద్యులతో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చికిత్స అందుకుంటున్నారు.
దేవుడి యొక్క నిండు మనసు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉండాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు చల్లగా చూడాలని , మళ్లీ ప్రజాక్షేత్రంలో తిరిగి ఆరోగ్యవంతంగా అడుగుపెట్టించాలని హృదయపూర్వకంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని మొక్కడం జరిగిందన్నారు.