ఉల్లేపల్లి అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు కార్యక్రమం
ఉల్లపల్లి సర్పంచ్ కలమ్మ
సూపర్వైజర్ షకీరా బేగం
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి సెక్టార్.ఉల్లేపల్లి.గ్రామ పంచాయతీ పరిధిలో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో బుధవారం ఉల్లేపల్లి అంగన్వాడి కేంద్రంలోని ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉల్లేపల్లి సర్పంచ్ కలమ్మ . ఐసీడీఎస్ సూపర్వైజర్ షకీరా బేగం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని పేర్కొన్నారు. పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం ఎంతో అవసరమని, మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరిగి, అనేక వ్యాధుల నుంచి రక్షణ.లభిస్తుందని.వివరించారు. అనంతరం ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు పోషకాహారం అందించాలని సూచించారు. గర్భిణీలు, బా లింతలు పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి,బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి, ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించేలా కుటుంబ సభ్యులు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ కలమ్మ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎం తులసి ఆశ రేణుక అంగన్వాడీ టీచర్స్ లక్ష్మి కాంతమ్మ శ్రీలత అంగన్వాడి ఆయాలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు