NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:44 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

మరిపెడ మున్సిపాలిటీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

 

మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఎ సి డి పి ఓ తేజ కళ్యాణి, కౌన్సిలర్ సురేష్.

నమస్తే భారత్ :-మరిపెడ

బలమైన భవిష్యత్తుకు తల్లిపాలే పునాది లాంటివని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓ తేజ కళ్యాణి, పట్టణ 14 వ కౌన్సిలర్ జాటోతు సురేష్ అన్నారు. మంగళవారంమరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో సేవా నగర్, బ్యాంక్ కాలనీ, రాము తండా, గ్యామాతండ,హౌసింగ్ బోర్డు, మైనార్టీ కాలనీ, అంగన్వాడి కేంద్రాలలో సంయుక్తంగా ప్రపంచ తల్లిపాలవారోత్సవాలనుఘనంగానిర్వహించారు.ఈకార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై చిన్న పిల్లలకు అన్నప్రసన్న ,అక్షరాభ్యాసాలు ఘనంగా.నిర్వహించారు.అనంతరం గర్భిణీలకు,బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి తల్లి తన బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే.ముర్రుపాలుత్రాగించాలన్నారు. తల్లిపాలు శిశువుకు అమృతం లాంటివన్నారు.తల్లిపాలు శ్రేష్టకరమైన పోషక విలువలు కలిగినవన్నారు.పిల్లలు బలవంతంగాఎదగడానికి తల్లిపాలే బలమైన పోషకాహారమని తెలిపారు. పుట్టిన బిడ్డకు కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని సూచించారు. తల్లిపాలు పొందడం ప్రతి శిశువు హక్కు అని, ప్రతి తల్లి తన మాతృత్వాన్ని,బాధ్యతను గుర్తించి పిల్లలకు తల్లిపాలు అందించాలన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వి. రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, కే. శ్రీమతి, రజిని, ఉమారాణి, శారద, అలీమా, హెల్పర్ సునీత,గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.