NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 9:28 pm Posted by : NAMASTHE BHARAT

తల్లిపాలే శిశువుకు అమృత ధార

తల్లిపాలే శిశువుకు అమృత ధార

నమస్తే భారత్ :-తొర్రూరు

శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలే అమృత ధారాలని సిడిపిఓ ఎం. రేష్మ అన్నారు.తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మంగళవారం మండలంలోని వెలికట్ట గ్రామంలో అంగన్వాడి సెంటర్-3 లో చిన్నారులకు అన్న ప్రసన్న చేసి, తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలని, తల్లిపాలు అమృతం లాంటిది అని, అందులో వ్యాధి నిరోధక శక్తి ఉండి పిల్లలకు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందన్నారు.గర్భిణీలుబాలింతలు ఆకుకూర,పాలు, గుడ్లు, మాంసం ఎక్కువగా తీసుకోవడంతో తల్లి శిశువు ఆరోగ్యం.మెరుగుపడుతుందన్నారు. అంగన్వాడి సెంటర్ లలో ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ.విజయలక్ష్మి,సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడి టీచర్లు ఎం. రాజ్యలక్ష్మి, బి.రాజ్యలక్ష్మి, ఆయాలు.పద్మ,సరిత,గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.