NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 8:05 pm Posted by : NAMASTHE BHARAT

వైభవంగా కే ఎస్ ఆర్ స్కూల్లో బోనాల పండుగ

వైభవంగా కే ఎస్ ఆర్ స్కూల్లో బోనాల పండుగ


నర్సంపేట, సెప్టెంబర్ 2 (నమస్తే భారత్ ) :

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కేఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్లో కరస్పాండెంట్ ఎన్. స్వాతి రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రత్యేకంగా నిలిచిన బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే విశిష్టమైన పండుగ బోనాల పండుగ అని అన్నారు. మహాకాళి అమ్మవారిని (పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ) దేవతలను ఆరాధిస్తూ జరుపుకునే రాష్ట్ర పండుగగా నిలిచిందని అన్నారు. బోనం అంటే భోజనం అనే పదం నుంచి బోనం పేరు వచ్చిందని పాఠశాల విద్యార్థులకు వివరించారు. బోనాన్ని అన్నం, బెల్లం, పాలు కలిపికొత్త కుండలో లో వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని తెలిపారు. మహిళలు పసుపు, కుంకుమ, వేపాకులు, నిమ్మకాయల తో అలంకరించిన బోనాల కుండలను తలపై పెట్టుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారికి సోదరుడిగా భావించే పోతురాజు ప్రత్యేక వేషధారణతో ఆకర్షణగా నిలుస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నరహరి స్వాతి రెడ్డి,ప్రిన్సిపాల్ మేరీ, మాధవి, మేకల కుమారస్వామి, సునీత, దివ్య, కర్రు శ్రీధర్, కూరపాటి మాణిక్యరావు, పడిశాల స్వామి, గుంటి రఘు, రాజు తదితరులు పాల్గొన్నారు.