విద్యార్థుల ఉత్సాహంతో శ్రీ నలంద పాఠశాలలో బోనాల సంబరాలు

విద్యార్థుల ఉత్సాహంతో శ్రీ నలంద పాఠశాలలో బోనాల సంబరాలు అలరించిన చిన్నారుల వేషధారణలు నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని స్థానిక బీరప్ప నగర్ లో గల శ్రీ నలంద పాఠశాలలో మంగళవారం ముందస్తు బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పోతురాజు, బోనాల వేషధారణలో పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ పాలడుగుల రవీందర్ మాట్లాడుతూ.ఆషాడ మాసం తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసమని అన్నారు. బోనాలు అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే...