NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:26 pm Posted by : NAMASTHE BHARAT

విద్యార్థుల ఉత్సాహంతో శ్రీ నలంద పాఠశాలలో బోనాల సంబరాలు

విద్యార్థుల ఉత్సాహంతో శ్రీ నలంద పాఠశాలలో బోనాల సంబరాలు

అలరించిన చిన్నారుల వేషధారణలు

నమస్తే భారత్ :-తొర్రూరు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని స్థానిక బీరప్ప నగర్ లో గల శ్రీ నలంద పాఠశాలలో మంగళవారం ముందస్తు బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పోతురాజు, బోనాల వేషధారణలో పాల్గొని ఉత్సాహపరిచారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ పాలడుగుల రవీందర్ మాట్లాడుతూ.ఆషాడ మాసం తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసమని అన్నారు. బోనాలు అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమని, బోనం అంటే భోజనం అని అర్థమని వివరించారు. మహిళలు కొత్త కుండలో అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి అమ్మవారికి సమర్పించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని భవితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్, ఏజీఎం పద్మాకర్, జెడ్ఎసి శివ, ప్రైమరీ కోఆర్డినేటర్ రజిని, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ సుధారాణి, అకాడమిక్ డీన్ వీరన్న, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇంచార్జులు, పీఈటీలు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.