NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:31 pm Posted by : NAMASTHE BHARAT

నర్వ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు మన ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు జరిపిన బీజేపీ నాయకులు. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి

నర్వ మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం మరియు మన ప్రియతమా ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు జరిపిన బీజేపీ నాయకులు. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి


నమస్తే భరత్, 17/9/2026/

నారాయణ పేట జిల్లా నర్వ మండల కేంద్రంలో నర్వ మండల బిజెపి అధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం తో పాటు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన *భారతీయ జనతాపార్టీ నాయకులు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు* తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం భారతమాత ముద్దుబిడ్డ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికకాబడిన కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు కిసాన్ మోర్చా జిల్లా కమిటీ సభ్యులు చాకలి బొజ్జన్న గారికి కిసాన్ మోర్చా జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత గారికి శాలువ కప్పి సన్మానించారు. అంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం నిరంకుశ పాలన నుండి బయటపడేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సేవలను కొనియాడారు ఆనాటి నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ధన మాన ప్రాణాలను పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆనాటి రోజులను గుర్తుచేశారు గతం లో పది సంవత్సరాలు పాలించిన BRS ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఎన్నికల్లో చెప్పి వారి ఇష్టం వచ్చిన పేర్లతో జరపడం శోచనీయం అన్నారు కానీ 2029 ఎన్నికల్లో రాబోయే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గోల్కొండ కోట పై అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా విశ్వ గురువు గా నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే విధంగ సుపరిపాలన అందిస్తున్నారని శత్రు దేశాలు మోదీ గారిని చూస్తేనే వెన్నులో వణుకు వచ్చేవిధంగా ఆయన దేశ వాతావరణాన్ని మార్చారని తెలియజేశారు అనంతరం బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మరియు *ఈరోజు సాయంకాలం 7 గంటల సమయానికి ప్రతి ఒక్కరు తమరి ఇండ్లలో జ్యోతిని వెలిగించి నరేంద్ర మోడీ గారికి మరింత బలాన్ని చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థించాలని తెలియజేశారు*
ఇట్టి కార్యక్రమం లో జిల్లా కౌన్సిల్ మెంబర్ లలితమ్మ గారు, జిల్లా నాయకులు సత్యం గారు, టెలికాం బోర్డ్ మెంబర్ నీరజ్ గారు, నర్వ మండల నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి గారు, టిలేటి రాం రెడ్డి గారు, పల్లె రాం రెడ్డి గారు,నర్వ బూత్ అధ్యక్షులు కిష్టారెడ్డి గారు, నర్వ బూత్అధ్యక్షులు చంద్రకాంత్ గారు, పెద్ద కోడుమూరు బీజేవైఎం నాయకులు అశోక్ గౌడ్ గారు, బిజెపి నాయకులు రాజు సింగ్ గారు, హోటల్ హనుమంత్ రెడ్డి గారు, గడ్డం అనిల్ గారు, బోయ పెద్ద ఆంజనేయులు గారు, బోయ చిన్న వెంకటప్ప గారు, శ్రీనివాసులు గారు, ఆటోబాలు గారు, వివిధ మూర్ఛాల అధ్యక్షులు ,బీజేవైఎం నాయకులు, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, జిల్లా మరియు మండల నాయకులు, నర్వ మండలం బిజెపి కార్యకర్తలు, యువకులు,తదితరులు పాల్గొనడం జరిగింది.