NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 8:15 pm Posted by : NAMASTHE BHARAT

షాద్ నగర్ లో ఘనంగా ప్రముఖ సామాజిక వేత్త పాతూరి వెంకటరావు జన్మ దిన వేడుకలు.

*షాద్ నగర్ లో ఘనంగా ప్రముఖ సామాజిక వేత్త పాతూరి వెంకటరావు జన్మ దిన వేడుకలు.*

*శ్రామిక బడిలో కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిల పంపిణీ. నవోదయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం.*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై01:ప్రముఖ సామాజిక వేత్త, పౌల్ట్రీ ఫార్మర్ పాతూరి వెంకట్రావు 72 వ జన్మదినం సందర్భంగా షాద్ నగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ శేషయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు పౌల్ట్రీ కార్మికుల పిల్లలకు నిర్వహిస్తున్న శ్రామిక బడి లో విద్యార్థిని విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు.
అనంతరం షాద్ నగర్ నవోదయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలానే
షాద్ నగర్ లో నిర్వహిస్తున్న పేదలకు పది రూపాయల భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు పాతూరి బ్రహ్మయ్య, కొర్రపాటి మోహన్రావు, కొల్లా శివ మోహన్ రావు, బండారుపల్లి నాగేశ్వరరావు, కొర్రపాటి శ్రీనివాసరావు, కొత్త ప్రభాకర్, బండారుపల్లి వెంకటేశ్వరరావు, నందు, కృష్ణారావు, గుదే శ్రీకాంత్, బొల్లినేని కోటేశ్వరరావు, పేరం అనిల్ కుమార్, కూ కుట్లలక్ష్మీనారాయణ, కిలారు సాంబశివరావు, పాతూరి రామ సుబ్బారావు, మొక్కపాటి మల్లేశ్వరరావు, కొర్రపాటి వెంకటరావు, కిలారు రఘురాం, ఆలపాటి పూర్ణ, నువ్వుల నాగేశ్వరరావు, కూకుట్ల సత్యనారాయణ, పాతూరి సత్యనారాయణ,పాతూరీవిద్యాసాగర్, మన్నవ సత్యనారాయణ మూర్తి, నువ్వుల నాగేశ్వరరావు మరియు సురేష్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.