ePaper
Saturday, August 8, 2026
ePaper
Homeఎడిటోరియల్మెడికల్ కాలేజీ వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహా ప్రతిష్టాత్మకకు భూమి పూజ

మెడికల్ కాలేజీ వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహా ప్రతిష్టాత్మకకు భూమి పూజ

📰 Generate e-Paper Clip

మెడికల్ కాలేజీ వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహా ప్రతిష్టాత్మకకు భూమి పూజ

నర్సంపేట ఆగష్టు6 ( నమస్తే భారత్ ) :
నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాత్మక కు భూమి పూజ వద్ద వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలని గ్రామీణ ప్రాంత విద్యార్థులు డాక్టర్లు కావాలని ఆకాంక్షతో పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పటి సీఎం కెసిఆర్ తో కొట్లాడి మెడికల్ కళాశాలను నర్సంపేట ప్రాంతానికి తీసుకురావడం జరిగిందన్నారు. అట్టి మెడికల్ కళాశాల ముందే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన ఆత్మ కు శాంతి చేకూరుతుందని అన్నారు.విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చిన డాక్టర్ లెక్కల విద్య సాగర్ రెడ్డి ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట నారాయణ, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్ రెడ్డి, డివిజన్ కో ఆర్డినేటర్ తక్కుల పెళ్లి రవీందర్ రావు , రాష్ట ఖనిజాబి వృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ నాడేo శాంతి కుమార్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ,బీఆర్ టీయు జిల్లా అధ్యక్షులు గోనెయువరాజు, మున్సిపల్ కౌన్సిలర్స్ ,మండల శ్రీదేవి శ్రీనివాస్, రాయిడి కీర్తి దుష్యంతు, శివరాత్రి స్వామి, బానోతు నవీన్ నాయక్, దొమ్మటి రమ్య సంతోష్, బుస రజిత, వార్డు అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్స్ ప్రసాద్, మహిళా విభాగం బాధ్యులు వాసంకరుణా, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!