NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 11:53 am Posted by : NAMASTHE BHARAT

ఆర్టీసీ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా బీసీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం

ఆర్టీసీ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా బీసీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం

నర్సంపేట జూలై8 (నమస్తే భారత్ ) :

ఆర్టీసీ ప్రభుత్వ విలీనం కోసం సమ్మె కాలంలోఆత్మబలిదానం చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అండగా నిలబడింది. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన శంకర్ గౌడ్ సంతాప సభలో 1 లక్ష 1 వేయి 116 రూపాయలను ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఈ. నిరంజన్ ఆధ్వర్యంలో అందించి మానవత్వం చాటారు. అదేవిధంగా ఆ కుటుంబానికి రాష్ట్ర మాజీ మంత్రి, సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. శంకర్ గౌడ్ సంతాప సభలో పలువురు వక్తలు శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం, శంకర్ గౌడ్ అమరహై, ఆర్టీసీ ప్రభుత్వ విలీనమైనప్పుడే శంకర్ గౌడ్ ఆత్మశాంతిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్ భార్య హేమలత, కుమారుడు హేమంత్ గౌడ్, కుమార్తె శాలిని, అల్లుడు సుమన్ గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గొలనకొండ వేణు, బీసీ ఉద్యోగుల సంఘం నర్సంపేట డిపో సెక్రటరీ బొడిగె రాజు, చైర్మన్ గుండెబోయిన హరి ప్రసాద్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.