తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ” బతుకమ్మ “
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా " బతుకమ్మ " ఖానాపురం ఎంపీడీఓ అద్వైత ఖానాపురం అక్టోబర్ 16(మల్లేష్ నమస్తే భారత్ ) : తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఎంపీడీఓ వి. అద్వైత అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి మహిళ అధికారులు , మహిళా ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని...