NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:56 pm Posted by : NAMASTHE BHARAT

మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ మూడో వార్డు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను.
ఈ సందర్భంగా అనంతగిరి శ్రీను మాట్లాడుతూ.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులందరూ సంతోషంగా,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. మూడో వార్డు ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ పండుగలను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు