విద్యుత్ వెలుగుల్లో తొర్రూరు.. అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు.

విద్యుత్ వెలుగుల్లో తొర్రూరు.. అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు. ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బతుకమ్మ వేడుకలకు అద్భుత ఏర్పాట్లు చేసిన తొర్రూరు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తొర్రూరు పట్టణంలో సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణమంతా విద్యుత్ దీపాల వెలుగులతో కళకళలాడగా, పండుగ వాతావరణం ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, మహిళల కోలాటాలు,...