తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బంధు యాకయ్య ఎన్నిక
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన బంధు యాకయ్య తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మంగళవారం ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లావుడియా రాములు నాయక్ ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల బలోపేతానికి కృషి చేసే లక్ష్యంతో బంధు యాకయ్యను రాష్ట్ర కమిటీలోకి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయన పదవీకాలం ఐదేళ్లపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బంధు యాకయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన సంఘం రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.బంధు యాకయ్య రాష్ట్ర స్థాయి పదవికి ఎన్నిక కావడం పట్ల రాంపురం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.