గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన
నమస్తే భారత్ :-తొర్రూరు
చిన్నారులపై జరుగుతున్న లైగింక దాడులకు అడ్డుకట్ట వేసేందుకై పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల(ఆడి బడి)లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇన్చార్జ్ హెచ్ఎం విమలాదేవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కే. శ్రీనివాస్ గౌడ్, స్వాతి, కుమారస్వామిలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పిల్లల రక్షణ చట్టం 2012 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చట్టాలు ఉంటాయన్నారు. పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పించే ఈ చట్టం గురించి అందరూ అవగాహన.కలిగి.ఉండాలన్నారు. గుడ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. లైంగిక నేరం జరిగినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. చిన్న వయసులో వివాహాలు చేస్తే జరిగే.అనర్థాలను.వివరించారుఈ.కార్యక్రమంలో.ఉపాధ్యాయులు విమలాదేవి, దర్గా హుస్సేన్, రేణుక, రోజా, విద్యార్థులు.తదితరులు.పాల్గొన్నారు.